ICET | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ ఏడాది ఎంసీఏ కోర్సుల్లో 86 శాతం, ఎంబీఏలో 87.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు తొలి విడుతలోనే 80 శాతానికి పైగా సీట్లు భర్తీ కావడం విశేషం.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కలిపి మొత్తం 34,748 సీట్లు ఉండగా, 30,300 సీట్లు తొలి విడుత కౌన్సెలింగ్‌లోనే నిండాయి. ఇక 4,448 సీట్లు మాత్రమే మిగిలాయి. 285 కాలేజీల్లో 91 కాలేజీలో వందశాతం సీట్లు నిండాయి. సీట్లు పొందిన విద్యార్థులంతా ఈ నెల 17లోపు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఫీజు చెల్లించిన వారంతా ఈ నెల 25 నుంచి 28 వరకు విద్యార్హత సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Transgenders | హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు : సీఎం రేవంత్ రెడ్డి
Vande Bharat trains | తెలుగు ప్రజలకు వినాయక చవితి కానుక.. కొత్తగా రెండు వందేభారత్ రైళ్లు
Padi Kaushik Reddy | రేవంత్‌రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష : పాడి కౌశిక్‌రెడ్డి