TG ICET 2025 | రామగిరి, మే 10: తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ‘ఐసెట్’-2025 దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పొడిగించినట్టు సెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవి తెలిపారు. అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.