Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరాలను వ్యక్తం చే స్తూ వెనుకబడిన కులసంఘాలు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అత్యంత వెనుకబడిన వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. బీసీల్లో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.
ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని తెలిపింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాలు చేస్తున్నారని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.