హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జనవరి 26న ఈ పథకం ప్రారంభం కాగా, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్‌గా ఎంపికచేసి గ్రామసభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమచేసింది. తొలుత 18,180 మందికి 6 వేల చొప్పున జమచేయగా, తర్వాత శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చింది.
దీంతో పథకం నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 66,240 మంది కూలీల ఖాతాల్లో రూ.39.74 కోట్లను ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) పద్ధతిలో జమచేసింది. మొత్తం 83,420 మంది కూలీల అకౌంట్లలో రూ.50.65 కోట్లు జమ అయ్యాయి.