హైదరాబాద్, నవంబర్ 23(నమ స్తే తెలంగాణ): కార్మిక, ఉపాధికల్పన శాఖలో ఐదుగురు సహాయ కమిషనర్లకు ఉప కమిషనర్లుగా పదోన్నతి క ల్పించడంతోపాటు పోస్టింగులు ఇస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. యాదయ్యను నిజామాబాద్ డీసీగా, ఏ రాజేశ్వరమ్మను ఆదిలాబా ద్, బీ జాసన్‌ను హైదరాబాద్-2, వినీతను వరంగల్, పీ జగదీశ్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో డీసీగా నియమించారు.