Fancy Numbers | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ వాహనదారులు తమకు ఇష్టమైన, లక్కీ నంబర్ ఎంత ఖర్చయినా చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే సుమారు రూ. 90 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల్లోనే సుమారు రూ.74కోట్లు ఆదాయం సమకూరడం విశేషం. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.100 కోట్లకు చేరుకునే అవకాశమున్నదని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మీటింగ్‌కు లేట్‌గా వచ్చినఎస్సైలకు క్రమ‘శిక్ష’ణ
వినాయక్‌నగర్, డిసెంబర్ 20: ఇటీవల ఓ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన ఏసీపీలు, సీఐలు, ఎస్సైలకు మరిచిపోలేని పనిష్మెంట్ ఇచ్చారు నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూశర్మ. వారితో పోలీస్ గ్రౌండ్ చుట్టూ ఐదు రౌండ్లు రన్నింగ్ చేయించారు. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.