DEECET Results | హైదరాబాద్ : రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రి స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కాలేజీలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న నిర్వహించిన (ఆన్లైన్)డీఈఈసెట్-2024 పరీక్ష ఫలితాలను సెట్ కన్వీనర్ బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలు జులై 25వ తేదీ నుంచి సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి.
ఈ ఫలితాలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో కలిపి మొత్తం 71.53 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు కన్వీనర్ తెలిపారు. ఇందులో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో నిర్వహించిన డీఈఈసెట్ కోసం మొత్తం 17,595 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 15,150 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 12,032 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం పరీక్షలు రాసిన వారిలో తెలుగు మీడియంలో 6,644 మంది, ఇంగ్లీష్‌లో 5,024 మంది, ఉర్దూలో 364 మంది విద్యార్థులు ఉన్నారు.
డీఈఈసెట్ ఫలితాలకు సంబంధించిన మార్కులు/ ర్యాంకు కార్డులు https://deecet.cdse.telangana.gov.in అనే వెబ్సైట్లో జులై 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని కన్వీనర్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్లు కేటాయింపు వంటి తేదీలు త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana Assembly | అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడగింపు
Srisailam reservoir | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం
Rains | రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ