TG TET | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్‌పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాల విడుదల నిలిచిపోయింది. టెట్ పరీక్షలను జనవరి 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. ఇంతలోనే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
కాగా ఫలితాలను విడుదల చేయాల్నా.. వద్దా? అనే అంశంపై పాఠశాల విద్యాశాఖ వర్గాలు ప్రభుత్వం నుంచి స్పష్టతకోరాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతరాలేదు. దీంతో ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది.