హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 3 నుంచి 20 వరకు నిర్వహించిన టెట్ ప్రాథమిక ‘కీ’ని https://schooledu.telangana.gov. in. వెబ్సైట్లో విద్యాశాఖ పొందుపరిచింది. ఈ ‘కీ’పై ఫిబ్రవరి 1న సాయంత్రం 5 వరకు అభ్యంతరాలు తెలుపవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు.
ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 23న విడుదల కానున్నది. ఫిబ్రవరి 27 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ షురూ కానున్నది. పీజీఈసెట్ సెట్ కమిటీ సమావేశాన్ని శుక్రవారం జేఎన్టీయూలో నిర్వహించగా, అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఆలస్య రుసుము లేకుండా మే 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.