హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మంగళవారం నిర్వహించిన టెట్ (సోషల్) పరీక్ష కోసం 83.02 శాతం హాజరు నమోదైనట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. తొమ్మిదో రోజు టెట్ పరీక్ష సెషన్-1లో 55 పరీక్ష కేంద్రాల్లో 82.65 శాతం, సెషన్ 2లో 47 కేంద్రాల్లో 84.30 శాతం హాజరు నమోదైందని వివరించారు.
సోషల్ సబ్జెక్టులో మొత్తం 28,426 మందికి 23,603 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షలు జూన్ 2 వరకు జరుగుతాయని కన్వీనర్ పేర్కొన్నారు.