ఝరాసంగం, నవంబర్ 19: చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు 70 ఏండ్ల వృద్ధుడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కొల్లూర్ గ్రామానికి చెందిన గాల్‌రెడ్డి ఝరాసంగం జడ్పీహెచ్ఎస్లో 2021-22 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ విభాగంలో పదోతరగతి పరీక్షలు రాసి పాసయ్యాడు. సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే పదోతరగతి విద్యార్హత కలిగి ఉండాలని ప్రభుత్వం ప్రకటించినందున 70 ఏండ్ల వయస్సులోనూ కష్టపడి చదివి టెన్త్ పాసైనట్టు గాల్‌రెడ్డి పేర్కొన్నాడు. శనివారం ప్రధానోపాధ్యాయుడు పోచయ్య చేతుల మీదుగా మెమో అందుకున్న గాల్‌రెడ్డి సంబురపడ్డాడు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు ఆయన్ను సన్మానించారు.