రంగారెడ్డి, జూలై 11 (నమస్తే తెలంగాణ): బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మా జీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిలను శంకర్పల్లి ఠాణాకు తరలించారు. మాజీమం త్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాబింద్రారెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలను చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గేట్ వద్ద అరెస్టు చేసి చేవెళ్ల ఠాణాకు తరలించారు.
సత్యవతి రాథోడ్ అక్కడినుంచి తప్పించుకొని షాబాద్ వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బీఆర్ఎస్ నేత లు షాబాద్ వెళ్లకుండా పోలీసులు అడ్డు కోవడంతో శంకర్పల్లి, చేవెళ్లలో తీవ్ర వా గ్వాదం చోటుచేసుకున్నది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను మాజీ మం త్రి సబితారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ క్యామ మల్లేశ్, పరిగి మాజీ ఎ మ్మెల్యే మహేశ్‌రెడ్డి, వికారాబాద్ మాజీ ఎ మ్మెల్యే మెతుకు అనంద్, డీసీఎంఎస్ మా జీ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి సందర్శించారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దైవాలగూడ గ్రామంలో జరిగిన ఆరు హత్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. బాధితులకు సానుభూతి తెలిపే హక్కునూ ప్రభుత్వం కాలరాస్తున్నది. హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఫల్యంతోనే శాంతిభద్రతలు అధ్వానంగా మారాయి. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై ఒక్కరోజు కూడా సీఎం సమీక్ష నిర్వహించలేదు. నిందితుడిపై నామమాత్రపు కేసు పెట్టడంతోనే నిందితుడు బయటికొచ్చి ఇంతమందిని హతమార్చాడు. బాధితుల కుటుంబంలోని దివ్యాంగురాలైన మహిళకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి. వెంటనే నిందితుడిని అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలి.
– సబితాఇంద్రారెడ్డి మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే