Rohingya | బడంగ్‌పేటలో పోలీసులపై రోహింగ్యాల దాడి
బర్మా దేశస్థుడి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోహింగ్యాలు సోమవారం మృతదేహంతో యూఎన్హెచ్ఆర్సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. దీంతో రాయల్ కాలనీ డైమండ్ హోటల్ వద్ద ఉద్రిక్త త నెలకొన్నది.
- రాయల్ కాలనీ డైమండ్ హోటల్ దగ్గర ఉద్రిక్తత
- బర్మా దేశస్థుడి మృతదేహంతో రోహింగ్యాల ఆందోళన
- పోలీసులపై రాళ్లు రువ్వడంతో కానిస్టేబుల్‌కు గాయాలు
- షరీఫ్‌నగర్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు
Rohingya | బడంగ్‌పేట, జనవరి 29: బర్మా దేశస్థుడి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోహింగ్యాలు సోమవారం మృతదేహంతో యూఎన్హెచ్ఆర్సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. దీంతో రాయల్ కాలనీ డైమండ్ హోటల్ వద్ద ఉద్రిక్త త నెలకొన్నది. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఇబ్రహీం అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు.
బర్మా దేశానికి చెందిన ఇబ్రహీం బంధువులు, స్నేహితులు మృతదేహంతో నేరుగా రాయల్కాలనీలోని యూఎన్హెచ్ఆర్సీ కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. వెంటనే అక్కడికి చేరుకున్న బాలాపూర్ సీఐ వెంకట్‌రెడ్డి ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు మాట్లాడుతుండగానే రోహింగ్యాలు పోలీసులపై రాళ్లు విసిరారు. శ్రీశైలం అనే హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు.
పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉండటంతో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు మృతదేహాన్ని షరీఫ్‌నగర్‌లోని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేయించారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారిని సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

