సిద్దిపేట : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో(Dubbaka) బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి(Solipeta Ramalingareddy) విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ శ్రేణులు భూమి పూజ చేశారు. అయితే అదే స్థానంలో దివంగత మాజీ మంత్రి ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ అభిమానులు భూమి పూజ చేసేందుకు వచ్చారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించి పంపించారు.
దుబ్బాకలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత
దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
అదే స్థానంలో దివంగత మాజీ మంత్రి ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ అభిమానులు
పోలీసులు… pic.twitter.com/xWkXZ6Xyue
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2024