జహీరాబాద్, అక్టోబర్ 16 : ప్రైవేటు వ్యక్తుల బారి నుంచి తమ ఇండ్ల స్థలాలను కాపాడాలని కోరుతూ గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయానికి ఐడీఎస్ఎంటీ కాలనీ బాధితులు తాళంవేసి ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంజీం, మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 20 ఏండ్ల క్రితం ఐడీఎస్ఎంటీ కాలనీలోని 158 సర్వేనంబర్‌లో ఇండ్ల స్థలాలను కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నట్టు తెలిపారు. ఇటీవల కొందరు ప్రైవేటు వ్యక్తులు ఐడీఎస్ఎంటీ కాలనీలోని 10 ఎకరాల స్థలం తమకు చెందినదని కోర్టు తీర్పు ఇచ్చిందని ఉత్తర్వుల తో వచ్చారని తెలిపారు.
కాలనీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజీరా తాగునీటి పైపులైన్, రహదారులు, మురుగుకాల్వను పోలీసు బం దోబస్తు మధ్య ప్రైవేటు వ్యక్తులు కూల్చివేసి ఫెన్సింగ్ వేశారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నాయకులు, బాధితులను అరెస్టు చేసేందుకు పోలీసులు య త్నించడంతో జరిగిన తోపులాటలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తంజీంతోపాటు ఓ బాధితురాలు సొమ్మసిల్లి పడిపోయారు.