రాయపర్తి, ఏప్రిల్ 10 : పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వీనిరెడ్డికి నిరసన సెగ తగిలింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకేతండాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన గుగులోత్ మహేశ్వరి(20) మృతదేహాన్ని సందర్శించేందుకు శుక్రవారం ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులతో కలిసి తండాకు వచ్చారు. ఆమెను చూసిన మృతురాలి కుటుంబ సభ్యులతోపాటు తండావాసులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ అసమర్థత కారణంగానే మహేశ్వరి హత్యకు గురైందం టూ మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులు పెద్ద ఎత్తున నినదించారు. దీంతో పోలీస్ పహారా మధ్య మహేశ్వరి మృతదేహంపై ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించి వెళ్లిపోయారు.