హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మక్కజొన్న పండించిన కౌలు రైతులు పట్టాదారు సంతకంతో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించవచ్చని అగ్రి, హార్టికల్చర్ సొసైటీ సలహాదారుడు వెంకటేశ్వర్రావు సూచించారు.
ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించవద్దని, మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేందుకు వీలుగా పట్టాదారుతో వ్యవసాయశాఖ జారీచేసిన కౌలు రైతు ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయించుకోవాలని సూచించారు.