ఐనవోలు, సెప్టెంబర్ 22: ఆర్థిక ఇ బ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా ఐనవో లు మండలం పంథిని గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నది. ఎస్సై పస్తం శ్రీనివాస్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్మెట శశికుమార్ (49) గీత వృత్తితోపాటు కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. రెండేళ్లుగా గ్రామంలో ఎకరం భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. పంట దిగుబడి సరిగా రాకపోవడం, గత నెలలోనే కూతురు వివాహం చేయడంతో రూ.6 లక్షల అప్పు అయ్యింది. ఈ క్రమంలో సోమవా రం భార్య సంగీత, కూతురు కీర్తి ఆరుబయట పనుల్లో నిమగ్నమై ఉండగా ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.