TSPSC | హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC )లో పది కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పరీక్షల కంట్రోలర్, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్, జూనియర్ నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్, జూనియర్ ప్రోగ్రామర్ పోస్టులతో పాటు జూనియర్ సివిల్ జడ్జి కేడర్‌లో లా ఆఫీసర్ పోస్టును మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రతిపాదనలు ఆమోదించింది ప్రభుత్వం.
టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్ నియామకం అయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్ సంతోష్ టీఎస్పీఎస్సీ పరీక్షల కంట్రోలర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీఎం సంతోష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతల నుంచి సంతోష్‌ను బదిలీ చేశారు.