హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ వేళ దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు అందించింది. హైదరాబాద్-విజయవాడ రూట్లో మరో పది ప్రత్యేక రైళ్లను నడుపాలని నిర్ణయించింది.
ఈ ట్రైన్లు ఈ నెల 11, 12, 13, 18,19 తేదీల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. వీటిలో రిజర్వేషన్ క్యాటగిరీతో పాటు సాధారణ ప్రయాణికులకు సైతం అవకాశం కల్పించారు.