హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజైన సోమవారం 10 మంది అభ్యర్థులు 14 సెట్ల నామినేషన్లు దాఖలు చేశా రు. మెదక్-నిజామాబాద్-ఆదిలాబా ద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజక వర్గం నుంచి ఆరుగురు ఎనిమిది సెట్ల నామినేషన్లు, టీచర్స్ స్థానం నుంచి ముగ్గురు ఐదు సెట్ల నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రా లు సమర్పించారు. అలాగే వరంగల్-కరీంనగర్-నల్లగొండ టీచర్స్ స్థానం నుంచి ఒకే అభ్యర్థి నామినేషన్ వేశారు. 3 నుంచి 10 వరకు సెలవు దినాల్లో (8,9 తేదీల్లో) మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో సీపీఎస్ఈయూ నుంచి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇన్నారెడ్డికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ స్టేట్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్లు మద్దతు పలికాయి.
టీచర్ ఎమ్మెల్సీ పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) మద్దతు పలికింది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కరీంనగర్, మెదక్, నిజాబాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ టీఎస్ మెసా రాష్ట్ర నేతలు లేఖ అందజేశారు.