హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 4 రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
శనివారం కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గం టకు 30-40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశాలున్నట్టు పేర్కొన్నది. గురువారం రాత్రి జగిత్యాల నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు పంటలకు నష్టం వాటిల్లింది.