హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం భద్రాచలంలో అత్యధికంగా 38.3 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా మంచిర్యాల జిల్లా ఖాసీపేట, ములుగు జిల్లా గోవిందరావుపేట, నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఐదురోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని తెలిపారు. హైదరాబాద్లో 33 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు. ఉత్తర, తూర్పు జిల్లాల్లో 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వివరించారు. మార్చి 2 నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అధికారులు చెప్పారు.