Weather Update | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజులపాటు వరుసగా భారీగా నమోదవుతూ వస్తున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. వడగాడ్పుల తీవ్రత సైతం తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. బుధ, గురువారాల్లో వాతావరణం చల్లబడింది. రాత్రి చల్లటి గాలులు వీశాయి. శుక్రవారం నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.