హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : తెలుగు వర్సిటీ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చనున్నది. కొత్తగా సురవరం ప్రతాపరెడ్డి పేరును ఖరారుచేసింది. శనివారం అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఇప్పటి వరకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(పీఎస్టీయూ) పేరుతో వర్సిటీ కార్యకలాపాలు నడుస్తున్నాయి. తాజా చట్టసవరణతో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ (ఎస్పీటీయూ)గా మారనున్నది.