హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఐటీ, ఆవిష్కరణలు దేశానికే ఆదర్శనీయం. దేశంలో మరే రాష్ట్రం ఐటీలో నూతన ఆవిష్కరణల ఆలోచన చేయనినాడే తెలంగాణ దిక్సూచి అయిందని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టీహబ్ ప్రారంభమై మంగళవారం నాటికి తొమ్మిదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తొమ్మిదేండ్ల క్రితం భారతదేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్‌ను రతన్ టాటా ప్రారంభించారు. టీహబ్ న్యూఫేజ్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. దేశంలో నూతన ఆవిష్కరణలకు, భవిష్యత్ సవాళ్లను అధిగమించేందుకు టీహబ్ వేదిక కావాలి అన్న దార్శనికతతో కేసీఆర్ ఆలోచనా విధానాలకు అంకురార్పణ జరిగిన అద్వితీయమైన రోజు రాష్ట్ర ఐటీ చరిత్రలో ఆనందకరమైనది అని ఎక్స్ వేదికగా తన అనుభూతులను పంచుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన అపురూప విజయాలు తెలంగాణ రాష్ర్టాన్ని స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండియా మలిచాయని తెలిపారు. టీహబ్‌తో పాటు వీహబ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) టీవర్స్, తెలంగాణ అకాడమీ ఫర్ సిల్ అండ్ నాలెడ్జ్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సరిల్ ఆఫ్ హైదరాబాద్
త(రిచ్) ఇలా అనేక సంస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ వేసిన పునాదులపై ప్రస్తుత నాయకత్వం మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.