హైదరాబాద్ జనవరి 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర వ్యవసాయశాఖ నుంచి బెస్ట్ అగ్రిప్రెన్యూర్స్‌గా బానోత్ రాందాస్ (మహబూబాబాద్), ఎం సాయి కిరణ్ (ఖమ్మం) ఎంపికయ్యారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ ప్రతినిధులు వీరికి మొదటి బహుమతి ప్రదానం చేశారు.
ఆధునిక వ్యవసాయంలో రైతులకు మేలు చేసే విధంగా వీరు స్టార్టప్‌లు పరిచయం చేశారు. ఈ స్టార్టప్‌ల ద్వారా 5,500 పైగా రైతులకు మేలు జరగడమే గాకుండా, దాదాపు 21 మందికి ఉద్యోగం కల్పించారు.