RRR | హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): కేంద్రప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపింది. రీజినల్ రింగ్‌రోడ్డు-ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్‌లో చేపడతామని గతంలో హామీ ఇచ్చిన కేంద్రం బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు. దీంతో సుమారు రూ.15,000 కోట్ల విలువైన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు లేవని అధికారవర్గాలు చెప్తున్నాయి.
కేసీఆర్ సర్కారు ముందుచూపుతో ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను కేంద్రానికి పంపించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకోవడంలో విఫలమైందని, కేంద్రం కూడా మొండి చేయి చూపిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఏపీకి మాత్రం కేంద్రం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ, విశాఖ నౌకాశ్రయం, వైద్యం, ప్రకృతి సేద్యం, రోడ్లు, వంతెనలు, జీవనోపాధి, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు పద్దులో ప్రాధాన్యతనిచ్చింది.