హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగింది శూన్యమేనని సాగు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని కేంద్రంపై నిప్పులు చెరిగారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏ ఒక్క ప్రాజెక్టుకూ నిధులు కేటాయించలేదని తెలిపారు. బిహార్, ఢిల్లీ ఎన్నికల బడ్జెట్‌లా ఉన్నదని శనివారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు.