హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో వీఆర్ఏ జేఏసీ నాయకులు వేర్వేరుగా సమావేశమయ్యారు. వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయుటకు సత్వరమే చర్యలు చేపట్టాలని మంత్రులకు వారు విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న వివిధ కేడర్ల పదోన్నతులతో పాటు ఇతర సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్ఏల సమస్యల పట్ల మంత్రులు సానుకూలంగా స్పందించారు. వీఆర్ఏల సమస్యలన్నింటినీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరలో పరిష్కారిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.
మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును కలిసిన వారిలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్‌తో పాటు అసోసియేట్ అధ్యక్షులు మన్నె ప్రభాకర్, పీ రాజ్ కుమార్, ఎండీ రియాజుద్దీన్, ఎల్ పూల్ సింగ్, ఉపాధ్యక్షులు నిరంజన్ రావు, మాధవి రెడ్డి, కార్యదర్శి మనోహర్ చక్రవర్తి, వీఆర్ఏ జేఏసీ నాయకులు చైర్మన్ రాజయ్య, కో చైర్మన్ రమేష్ బహదూర్,సెక్రటరీ జనరల్ దాదేమియా, కన్వీనర్ సాయన్న, కో కన్వీనర్ వెంకటేష్ యాదవ్, ఎండీ రఫీ, వంగూరు రాములు, శిరీష రెడ్డి, నర్సింహా రావు , మాధవ్ నాయుడు, గోవింద్, సునీత, హైదరాబాద్ ట్రెసా అధ్యక్షులు కె రామకృష్ణ, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, రామకృష్ణా రెడ్డి తదితరులు ఉన్నారు.