రవీంద్రభారతి, సెప్టెంబర్ 30: తెలంగాణ సాధ న ఉద్యమానికి బాసటగా నిలిచిన విశ్వబ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం ఉండగా ఉంటుందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్ భరోసా ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ/ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో విశ్వబ్రాహ్మణ నూతన కార్యవర్గ పదవీ ప్రమాణం, ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. అన్ని రకాల కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి ఎంతో కృషిచేస్తూ దేశంలోనే నంబర్‌వన్ సీఎంగా కేసీఆర్ పేరు తెచ్చుకుంటున్నారని అన్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సం ఘంలోని సభ్యులు సమాఖ్యగా ఉండి హక్కులు సాధించుకోవాలని కోరారు. ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల కోసం ఉప్పల్ భగాయత్‌లో ఐదెకరాల భూమి, రూ.5 కోట్లను కేటాయించిందని గుర్తుచేశారు. విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ ప్రోత్స హం అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, నాయకులు డాక్టర్ వెంకటాచారి, డాక్టర్ మదన్మోహన్చారి, చొల్లేటి కృష్ణమాచారి, రాగబడి రవీంద్రాచారి, దానకర్ణచారి, రవిచారి, డాక్టర్ లాలుకోట వెంకటాచారి, రాగి ఫణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వేములవాడ మదన్మోహన్ ఆచారిని సత్కరించించారు. నూతన కార్యవర్గసభ్యులతో ప్రమాణం చేయించి సన్మానించారు.