ఈవోడీబీలో తెలంగాణ టాప్ అచీవర్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ మరోసారి టాప్ ర్యాంకింగ్‌లో నిలవడం గర్వకారణం. డీపీఐఐటీ.. దేశంలోని ఆరు రాష్ర్టాలతోపాటు తెలంగాణకు టాప్ అచీవర్ రేటింగ్ ఇచ్చింది. కాకపోతే మా రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ మాత్రమే కాదు.. దానికంటే ముఖ్యంగా పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ఆఫర్ చేస్తున్నాం
నాలుగు విభాగాలుగా రాష్ర్టాల విభజన
మొదటి విభాగంలో నిలిచిన తెలంగాణ
పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా
మరోసారి రాష్ర్టానికి దక్కిన గుర్తింపు
టీఎస్ఐపాస్తో తరలివస్తున్న కంపెనీలు
సీఎం కేసీఆర్, కేటీఆర్ కృషి ఫలితం
టాప్ ర్యాంకింగ్ గర్వకారణం
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ మరోసారి టాప్ ర్యాంకింగ్‌లో నిలవడం గర్వకారణం. డీపీఐఐటీ.. దేశంలోని ఆరు రాష్ర్టాలతోపాటు తెలంగాణకు టాప్ అచీవర్ రేటింగ్ ఇచ్చింది. కాకపోతే మా రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ మాత్రమే కాదు.. దానికంటే ముఖ్యంగా పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ఆఫర్ చేస్తున్నాం.
– మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మరోసారి సత్తా చాటింది. దేశంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉన్న రాష్ర్టాల్లో అగ్రభాగాన నిలిచింది. సులభతర వాణిజ్య విధానంలో కేంద్రం ప్రకటించిన గ్రేడింగ్‌లో తొలి వరుసలో నిలిచి, తన స్థానాన్ని పదిలపర్చుకొన్నది. పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతమని అనేకమంది ప్రపంచస్థాయి పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ప్రకటించగా, దాన్ని కొనసాగింపుగా కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్య విధానం (ఈడీవోబీ) క్యాటగిరీలు అధికారికం చేశాయి. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈవోడీబీ గ్రేడింగ్‌లను ప్రకటించారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) నిర్దేశించిన 301 సంస్కరణల్లో 281 సంస్కరణలను తెలంగాణ పూర్తిచేయగా, మరో 20 సంస్కరణలు రాష్ర్టానికి సంబంధం లేవిని ఉన్నాయి. ఈవోడీబీలో గతంలో ర్యాంకులు ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు గ్రేడింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. 95 శాతం, అంత కంటే ఎక్కువ స్కోర్ సాధించిన రాష్ర్టాలను టాప్ అచీవర్స్‌గా, 90 నుంచి 95 శాతం స్కోరు సాధించిన రాష్ర్టాలను అచీవర్స్‌గా, 80 నుంచి 90 శాతం సాధించిన రాష్ర్టాలను ఫాస్ట్ మూవర్స్‌గా, 80 శాతం అంతకంటే తక్కువగా వచ్చిన రాష్ర్టాలను అస్పైర్స్గా ప్రకటించింది. ఈ క్యాటగిరీల్లో తెలంగాణ మొదటి గ్రేడ్ సాధించి, టాప్ అచీవర్‌గా నిలిచింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హర్యానా, పంజాబ్, కర్ణాటక, గుజరాత్ రాష్ర్టాలు మొదటి విభాగంలో ఉన్నాయి.
టీఎస్ఐపాస్ గొప్పదనమే ఇదంతా!
2015లో సంస్కరణల అమలులో 42.45% స్కోరును మాత్రమే సాధించి దేశంలో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దూరదృష్టి, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పట్టుదలతో సులభతర వాణిజ్య విధానం-2016లో తెలంగాణకు దేశంలోనే నెంబర్‌వన్ ర్యాంకు లభించింది. ఆ తర్వాత కూడా టాప్ 3లో వరుసగా నిలుస్తూ వచ్చింది. తాజాగా ప్రకటించిన గ్రేడింగ్‌లో మొదటి గ్రేడ్‌లో నిలిచింది. కారణం.. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ఐపాస్). పరిశ్రమలు స్థాపించే యజమాన్యాలు దాదాపు 15కు పైగా శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ టీఎస్ఐపాస్ను తీసుకొచ్చారు. ఇది ప్రపంచంలోని అనేకమంది పారిశ్రామికవేత్తల ప్రశంసలు అందుకొన్నది. 2015 అమల్లోకి వచ్చిన ఈ చట్టం వల్ల రాష్ర్టానికి భారీఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కేవలం 15 రోజుల్లోనే భారీ పరిశ్రమలకు అనుమతులు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే అనుమతులు ఇస్తున్నారు. పరిశ్రమల పెట్టుబడులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భూముల కోసం 1.50 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్తు నీటి వసతిని ఏర్పాటు చేస్తున్నారు. మిషన్ భగీరథలో 10 శాతం నీటిని పరిశ్రమల అవసరాలకు కేటాయించారు. వీటన్నింటి ఫలితంగా రాష్ర్టానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు
2020 సంవత్సరానికి గాను 301 సంస్కరణలను కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. దీనిలో తెలంగాణ 94.86 శాతం స్కోర్ సాధించింది. మొత్తం 301 సంస్కరణలకు గాను 281 సంస్కరణలను పూర్తిచేయగా మరో 20 సంస్కరణలు రాష్ర్టానికి సంబంధం లేనివే. మిగతా అన్ని విభాగాల్లో సంస్కరణలను పూర్తి చేసింది. కన్స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబులర్స్, యుటిలిటీ అనుమతులు, భూ సంస్కరణలు, భూ బదిలీ, ఆస్తి బదిలీ, భూ వినియోగంలో మార్పులు, ఇన్స్పెక్షన్ ఎనేబులర్స్, తూనికలు కొలతలు, అతిథ్య రంగం, పర్యాటక రంగం అంశాల్లో సంస్కరణలను 2020లో అమలు చేసింది. దీనిలో భాగంగా చట్టాలకు సవరణలు, జీవోలు, సర్క్యులర్లు జారీ చేసింది. లక్ష్యాల సాధనకు మంత్రి కేటీఆర్ తీవ్రంగా కృషి చేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. సంస్కరణలు వేగవంతంగా పూర్తి చేయటంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపారు. శాఖల మధ్య సమన్వయం కోసం నోడల్ అధికారులను నియమించారు. ఫలితంగా ఈవోడీబీలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.
సంస్కరణలు ఇలా.. కార్మిక శాఖలో..
- లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లకు ఆటో రెన్యూవల్ అవకాశాన్ని కల్పించారు. దీని ద్వారా ప్రతిసారి పరిశ్రమలకు అవసరమైన వాటికి రెన్యూవల్ చేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది.
- పరిశ్రమల తనిఖీకి సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టం(సీఐఎస్) విధానాన్ని తీసుకొచ్చారు.
- తక్కువ ప్రమాదాలకు అవకాశం ఉన్న పరిశ్రమలకు తనిఖీల నుంచి మినహాయింపునిచ్చారు.
- ఎంప్యానలింగ్ చేయడానికి థర్డ్ పార్టీ ఏజెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు.
- ఆన్లైన్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ రిటర్న్ ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
- పరిశ్రమలను తనిఖీ చేయడానికి ఇన్స్పెక్టర్లను కంప్యూటైరైజ్డ్ విధానంలో కేటాయించారు.
- పరిశ్రమలను తనిఖీ చేసిన నివేదిక 48 గంటల్లో ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.
- ఒక ఇన్స్‌స్పెక్టర్ ఒక పరిశ్రమను వరుసగా రెండు సార్లు తనిఖీ చేయడానికి వీల్లేకుండా చేశారు.
కాలుష్య నియంత్రణ మండలిలో
- గ్రీన్ క్యాటగిరీ విభాగంలోని పరిశ్రమలకు తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకొనే నిబంధనను ఐదేండ్లకు పెంచారు. దీన్ని కూడా ఆటో రెన్యూవల్గా మార్చారు.
- ప్రమాదాల తీవ్రత మధ్యస్తంగా ఉండే పరిశ్రమలకు థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తక్కువ ప్రమాదం ఉండే పరిశ్రమలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాన్ని తీసుకొచ్చారు.
- ఆరెంజ్ క్యాటగిరీ పరిశ్రమల్లో తనిఖీలకు థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ కోసం ఏజెన్సీలను ఎంప్యానెల్ చేశారు.
వాణిజ్యపరమైన వివాదాలకు
- వాణిజ్యపరమైన వివాదాల పరిష్కారం కోసం రెండు ప్రత్యేకమైన వాణిజ్య కోర్టులను ఏర్పాటు చేశారు.
- రెండు వాణిజ్య కోర్టుల్లో ఈ-ఫైలింగ్, ఈ-సమన్స్, ఈ-పేమెంట్స్, ఈ-కాజ్ లిస్ట్, డిజిటల్లీ సైన్డ్ సర్టిఫికెట్స్ విధానాన్ని తీసుకొచ్చి పేపర్‌లెస్ కోర్టులుగా మార్చారు.
- ప్రతి నెలా ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి? ఎన్ని అప్పీళ్లు వచ్చాయి? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? తదితర వివరాలను వెల్లడిస్తున్నారు.
భూ పరిపాలన
- రాష్ట్రంలో ల్యాండ్ రికార్డ్స్‌ను పూర్తిగా కంప్యూటరీకరించారు.
- దేశంలో అతి పెద్ద ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేశారు.
- పరిశ్రమలకు అవసరమైన భూముల వివరాలకు జీఐఎస్ మ్యాపింగ్ చేశారు. ఆ భూమి దగ్గర వసతులు, సౌకర్యాలు, రవాణా, నీటి, విద్యుత్తు తదితర సౌకర్యాలన్నీ ఆన్లైన్లో జీఐఎస్ మ్యాపింగ్ విధానంలో పరిశ్రమల యజమానులు చూసుకోవచ్చు.
- సెక్టోరియల్ విభాగాల వారీగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్లగ్ అండ్ ప్లే విధానంలో భూములను సిద్ధం చేస్తున్నారు.
- భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణిని అమలు చేస్తున్నారు. ధరణి ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వెంటనే చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

