న్యూఢిల్లీ: దేశంలో ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ విభాగంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ విషయాన్ని ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, డెయిరీ విభాగాల కేంద్ర మంత్రి పర్శోత్తమ్ రూపాలా వెల్లడించారు. ప్రపంచ ఫిషరీస్ దినోత్సవం సందర్భంగా భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు.
ఇన్లాండ్ ఫిషరీస్ విభాగంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రంగా తెలంగాణ నిలవగా.. బెస్ట్ మెరైన్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఒడిషాలోని బాలాసోర్ జిల్లా బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్ అవార్డు అందుకుంది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా ఉత్తమ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ జిల్లాగా అవార్డు గెలుచుకుంది. అలాగే కొండ, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ విభాగంలో ఉత్తమ రాష్ట్రంగా త్రిపుర నిలిచింది.
ఇదే విభాగంలో ఉత్తమ జిల్లాగా అస్సాంలోని ఉత్తమ జిల్లా అవార్డు అందుకుంది. 2024-25 నాటికి ఫిషరీస్ రంగంలో లక్షకోట్ల రూపాయల ఎగుమతులే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా రూపాలా వెల్లడించారు. రాష్ట్రాలు ఒకదాన్ని చూసి మరొకటి స్ఫూర్తి పొందాలని, ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ విభాగంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచినందుకు కేబినెట్ మంత్రి కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
#Telangana top performer in inland fisheries says Govt of India – The Week#BlueRevolution https://t.co/mOs9woeFIE
— KTR (@KTRTRS) November 22, 2021