Teachers | బడికి డుమ్మా కుదరదిక.. టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్
బడులకు గైర్హాజరవుతున్న టీచర్లను గాడినపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్ర్తాన్ని సంధిస్తున్నది. టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేయనున్నది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఈ హాజరువిధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో టీచర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇచ్చారు.
- కొత్త విద్యాసంవత్సరం నుంచి అమలు!
- యాప్‌లో టీచర్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం
Teachers | హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): బడులకు గైర్హాజరవుతున్న టీచర్లను గాడినపెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్ర్తాన్ని సంధిస్తున్నది. టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేయనున్నది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఈ హాజరువిధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో టీచర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇచ్చారు. జూన్ 12న రాష్ట్రంలోని బడులు పునఃప్రారంభంకానున్నాయి. ఈ లోపు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్‌ను ముగించి రోజు నుంచే ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలుచేయనున్నది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లలో యాప్ ను ఇన్స్టాల్ చేసి, కెమెరా ఆధారంగా స్కాన్ చేయగానే హాజరు నమోదు చేయడం దీని ప్రత్యేకత. గతంలో టీచర్లకు నిరుడు 19,200 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఇటీవలే 4జీ జియో సిమ్‌కార్డులను కూడా అందజేశారు. ఆయా సిమ్‌కార్డులను ట్యాబ్‌లలో యాక్టివేట్ చేయాలని ఆదేశాలిచ్చారు.
సంతకాలు పెట్టడం కుదరదిక..
ఒక విద్యార్థి ఒకట్రెండు రోజులు బడికి రాకపోతేనే ఎందుకురాలేదని అడిగే రోజులివి. కానీ ఇలా అడగాల్సిన కొంత మంది టీచర్లు ఇష్టానుసారంగా విధులకు డుమ్మా కొడుతున్నారు. నిరుడు జగిత్యాల జిల్లాలో ఓ టీచర్ ఏకంగా 20 ఏండ్ల పాటు విధులకు డుమ్మాకొట్టిన ఘటన వెలుగుచూసింది. ఇక 2021లో 153 మంది టీచర్లు ఏడాది నుంచి 8 ఏండ్లు పత్తాలేకుండా పోయినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని కొందరు టీచర్లు దుబాయ్, సౌదీ వంటి దేశాల్లో టీచర్లుగా పనిచేస్తున్నట్టు అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. ఇక మారుమూల ప్రాంతాల్లోని బడుల్లో ఇద్దరు టీచర్లు ఉంటే రోజుకు ఒకరు చొప్పున వంతులేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. తాజా హాజరు విధానంతో ఇలాంటి వాటికి చెక్‌పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. టీచర్ల హాజరు నమోదుకు ఇంత కాలం రిజిష్టర్లు వాడేవారు. కొందరు టీచర్లు విధులకు హాజరుకాకున్న తాపీగా మరుసటి రోజు వచ్చి సంతకాలు పెట్టేవారు. కానిప్పుడు ఇలాంటివి ఈ విధానంతో కుదరడం కష్టమేనన్న స్పష్టంగా తెలుస్తున్నది.
అమలు ఇలా..
- స్కూళ్లకు అందజేసిన ట్యాబ్ / స్మార్ట్‌ఫోన్లల్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)ను ఇన్స్టాల్ చేస్తారు.
- మొదట బడుల వారీగా టీచర్ల రిజిస్ట్రేషన్‌ను చేపడుతారు. ఇందులోభాగంగా వ్యక్తిగత చిత్రాలు (ఫొటోలను) యాప్‌లో లోడ్‌చేస్తారు.
- టీచర్ స్మార్ట్‌ఫోన్/ ట్యాబ్ కెమెరాను తెరిచి, స్కాన్ చేయగానే ఎఫ్ఆర్ఎస్ అప్లికేషన్, కాగ్నిటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి, డాటాబేస్‌లో ఉన్న చిత్రాలతో పోల్చుకుంటుంది.
- ఆయా ముఖాల (చిత్రాల) ఆధారంగా ఆ రోజు ఎంత మంది హాజరయ్యారో, ఎంత మంది గైర్హాజరయ్యారో అప్పటికప్పుడే తేల్చేస్తుంది.
- ఇది జియోగ్రాఫికల్ లోకేషన్ కూడా గ్రహిస్తుంది. టీచర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

