హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణతో రాష్ట్రాలకు రాబడి తగ్గే ప్ర మాదం ఉన్నదని, తెలంగాణకు రూ.7 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు నష్టం జరగవచ్చని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు బాగుంటేనే దేశం బాగుంటుందని పేర్కొంటూ.. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సంప్రదింపుల సమావేశం నిర్వహించింది.
ఢిల్లీలోని కర్ణాటక భవన్లో భట్టి విక్రమార మాట్లాడుతూ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల రాష్ట్రా ల అభివృద్ధితోపాటు సంక్షేమ పథకా లు, మౌలిక సదుపాయాలపై ప్రభా వం పడుతుందని తెలిపారు. వ్యాట్‌ను కొనసాగించి ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ. 69, 373 కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ.. జీఎస్టీ ద్వారా రూ.42,443 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పారు. రాష్ట్ర సొంత పన్ను రాబడుల్లో జీఎస్టీ వ సూళ్లు 39 శాతమేనని, జీఎస్టీ రేట్లలో ఏవైనా తగ్గింపులు ఉంటే రాష్ర్టాల ఆదాయంపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం చెల్లించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
‘చాలా రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో నూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో జీఎస్టీ హేతుబద్ధీకరణపై లో తుగా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతు న్నాం’ అని భట్టి విక్రమార చెప్పారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదే అంశంపై 3న తమిళనాడు భవన్లో బ్రేక్‌ఫాస్ట్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆ అంశాలను 8న ఢిల్లీలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని భట్టి విక్రమార తెలిపారు.