టీఎస్టీపీపీ ట్రయల్న్ సక్సెస్
ఏపీ పునర్వస్థీకరణ చట్ట ప్రకారం పూర్తిగా తెలంగాణ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీ ఆవరణలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్టీపీపీ) ట్రయల్ రన్ సక్సెస్ అయింది.
- దిగ్విజయంగా విద్యుత్తు ఉత్పత్తి
జ్యోతినగర్, సెప్టెంబర్ 6: ఏపీ పునర్వస్థీకరణ చట్ట ప్రకారం పూర్తిగా తెలంగాణ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీ ఆవరణలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్టీపీపీ) ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రాష్ట్ర అవసరాల కోసం కేటాయించిన 4వేల మెగావాట్లలో ఫేజ్-1 కింద రెండు యూనిట్లు (800 మెగావాట్ల చొప్పున) మొత్తం 1,600 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మించిన విషయం తెలిసిందే. యూనిట్-1లో చేపట్టిన విద్యుత్తు ఉత్పత్తి ట్రయిల్ రన్ సక్సెస్ అయింది.
గత జూలైలోనే యూనిట్ లైటప్తో ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చిన అధికారులు, విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానించి కమర్షియల్ ఆపరేషన్ డిక్లేర్ (సీవోడీ)గా ప్రకటించడం కోసం ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు 72 గంటలపాటు ఏకధాటిగా 811.4 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయడంతో లైన్ క్లియర్ అయింది. యూనిట్ విద్యుత్తు సీవోడీకి అర్హత సాధించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే రెండో యూనిట్ (800 మెగావాట్ల)ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

