వాషింగ్టన్, మే 9: అమెరికాలో మరో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. షికాగోలో ఈ నెల 2 నుంచి చింతకింది రూపేశ్ చంద్ర అనే విద్యార్థి కనిపించకుండా పోయారు. ఇండియన్ ఎంబసీ గురువారం ఈ విషయం వెల్లడించింది. ‘రూపేశ్ చంద్ర మే 2 నుంచి కనిపించకపోవడంపై భారత కాన్సులేట్ జనరల్ విచారం వ్యక్తం చేస్తున్నది. అతడి అచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయమై పోలీసులు, స్థానిక భారతీయ సమాజంతో మేం టచ్లో ఉన్నాం’ అని కాన్సులేట్ ట్వీట్ చేసింది. రూపేశ్ సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు తెలపాలని ఈ నెల 6న షికాగో పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చిలో అమెరికాలో అదృశ్యమైన మొహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ అనే హైదరాబాద్ విద్యార్థి ఏప్రిల్లో విగత జీవిగా కనిపించాడు. ఈ ఏడాదిలో అమెరికాలో అక్కడక్కడ కొందరు భారత విద్యార్థులపై దాడులు జరిగాయి.