మేడిపల్లి, అక్టోబర్ 4: బ్రిటన్‌లో తెలంగాణ విద్యార్థి ఏనుగు మహేందర్‌రెడ్డి (26) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా దమ్మన్నపేట గ్రామానికి చెందిన రమేశ్‌రెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి రెండేండ్ల క్రితం ఎంసీఏ చదవడం కోసం లండన్ వెళ్లాడు. ఇటీవలే పీజీ పూర్తి కాగా వర్క్ వీసా కూడా లభించింది.
శుక్రవారం రాత్రి 12 గంటలకు మహేందర్‌రెడ్డి మిత్రులు లండన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, మహేందర్‌రెడ్డి గుండె నొప్పితో మృతి చెందాడని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యు లు కన్నీరుమున్నీరయ్యారు. మహేందర్ తండ్రి రమేశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షుడిగా ఉన్నారు.