Telangana State Women’s Commission | హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha )పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
ఈ నేపథ్యంలో బండి సంజయ్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయనుంది. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించనుంది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని డీజీపీ( DGP )ని మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది.