హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): వరదలతో దెబ్బతిన్న నాగార్జున సాగర్ ఎడమకాలువ, చెరువులు, వాగుల గండ్లను పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు భాగం ఏమంత రావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు.
ఈ నెల 3న కాలువలు, చెరువులకు గండ్లు పడటంతో పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయన్నారు. దీంతో సాగర్ నీళ్లు వస్తాయో లేదోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. పంట నష్ట పరిహారం కోసం రాష్ర్టానికి రూ.10వేల కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.