Telangana | ఒక కుటుంబానికి గత సంవత్సరం వచ్చిన సంపాదన కన్నా.. ఈసారి ఎక్కువ వస్తేనే బాగుపడుతున్నట్టు లెక్క. ఇదే సూత్రం రాష్ర్టానికి, దేశానికి వర్తిస్తుంది. గతంతో పోల్చితే ఒక రాష్ట్ర ఆదాయం ఏటికేడు వృద్ధి చెందితేనే.. ఆర్థికంగా వృద్ధి చెందుతున్నట్టు లెక్క. కానీ నిరుటితో పోల్చితే ఈ ఎనిమిది నెలల్లో తెలంగాణ ఆదాయం భారీగా తగ్గిపోయింది.సూత్రం రాష్ర్టానికి, దేశానికి వర్తిస్తుంది. గతంతో పోల్చితే ఒక రాష్ట్ర ఆదాయం ఏటికేడు వృద్ధి చెందితేనే.. ఆర్థికంగా వృద్ధి చెందుతున్నట్టు లెక్క. కానీ నిరుటితో పోల్చితే ఈ ఎనిమిది నెలల్లో తెలంగాణ ఆదాయం భారీగా తగ్గిపోయింది.
నిరుడు నవంబర్ నాటికి ఖజానాకు రూ.1,11,141.37 కోట్ల ఆదాయం రాగా.. ఈ సారి రూ.7,841.33 కోట్లు తగ్గింది. అంటే నిరుడు కన్నా 7.05 శాతం తగ్గుదల నమోదైంది. వాస్తవానికి ఆదాయ పరంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఏటికేడు వృద్ధి సాధిస్తున్నది. కరోనాతో 2020-21లో ఆదాయం పడిపోయినా.. ఆ మరుసటి సంవత్సరమే కోలుకున్నది. కానీ.. ఐదేండ్ల తర్వాత తొలిసారి రాష్ట్ర ఆదాయం తిరోగమనం వైపు సాగింది. దీనిని బట్టే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.