Social Media | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో సోషల్ మీడియాపై రాష్ట్ర పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియా ఖాతాలైన వాట్సాప్, ఫేస్బు క్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో పెట్టే పోస్టులు, చేసే కామెంట్లపై నెటిజన్లు, ఆయా గ్రూపుల సభ్యులు జాగ్రత్తలు వహించాలి.
ఆయా గ్రూపుల్లో పార్టీలను, అభ్యర్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, పోస్టు పెట్టడం, ఫొటో ఎడిట్ చేయడం, వాయిస్ మెసేజ్లు పెట్టడం తక్షణమే మానుకోవాలని సూచించారు. ఆయా గ్రూపుల్లో తమకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టుల ఆధారంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. తప్పనిసరిగా అడ్మిన్, ఆ పోస్టు చేసిన వ్యక్తిని విచారించి, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.