బాలికల టాయిలెట్లలో మనమే టాప్
ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బాలురతో పొల్చితే బాలికలకు అత్యధికంగా టాయిలెట్లు గల రాష్ర్టాల్లో తెలంగాణ, కేరళ నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి.
- దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
- బాలురతో పొల్చితే అధికం
- రాజ్యసభలో కేంద్రం వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిష్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. బాలురతో పొల్చితే బాలికలకు అత్యధికంగా టాయిలెట్లు గల రాష్ర్టాల్లో తెలంగాణ, కేరళ నంబర్ వన్ స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలురకు సగటున 1 టాయిలెట్ ఉంటే.. బాలికలకు సగటున 1.47 టాయిలెట్లు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బాల, బాలికల టాయిలెట్ల నిష్పత్తిపై రాజ్యసభలో ఎంపీ అబ్దుల్ వాహబ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ బుధవారం సమాధానమిచ్చారు. 2021-22 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్(యూడైస్) నివేదిక ఆధారంగా గణాంకాలను రాజ్యసభలో వెల్లడించారు.
జాతీయ స్థాయిలో బాలికలకు సగటున 1.09 టాయిలెట్లు ఉండగా, తెలంగాణలో అంత కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఇటీవల తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున టాయిలెట్లను నిర్మించారు. తాజాగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో టాయిలెట్ల నిర్మాణం, ఆధునికీకరణ, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. దీంతోనే టాయిలెట్ల నిష్పత్తిలో తెలంగాణ అగ్రభాగంలో ఉన్నదని అధికారులు చెప్తున్నారు. పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్ల నిర్మాణం విషయంలో బీజేపీ రాష్ర్టాలు వెనుకబడి ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

