హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ) : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్ఆర్టీయూ)లు సోమవారం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.
గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పాల ఉత్పత్తి, గొర్రెలు, మేకల పెంపకం, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ వంటి రంగాల్లో సాంకేతిక మార్గదర్శకత్వం, శిక్షణ అందించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. గ్రామీణ పేద కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ చెప్పారు. మంత్రి సీతక ఆదేశాల మేరకు వెటర్నరీ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు.