హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కేసీఆర్ హయాంలో నిర్మించిన సెక్రటేరియట్ అద్భుతమని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కితాబునిచ్చారు. తాడేపల్లిలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ 28 ఎకరాల్లో రూ.615 కోట్లతో సెక్రటేరియట్ కట్టారని గుర్తుచేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ భవనాన్ని రూ.970 కోట్లతో కట్టినట్టు వివరించారు. ఏపీలో మాత్రం చంద్రబాబునాయుడు అసెంబ్లీ భవనాన్ని రూ.1,449 కోట్లతో నిర్మించడం ఏమిటి? అని ప్రశ్నించారు.
గ్రోత్ ఇంజిన్‌గా ‘మావిగన్’
రాజధాని విషయంలో తమ ఆలోచనలు చంద్రబాబుకు నచ్చలేదని జగన్ ఆరోపించారు. ప్లాన్-బీ కింద మావిగన్‌ను తాము ప్రతిపాదించినట్టు వెల్లడించారు. మచిలీపట్నం టు విజయవాడ, విజయవాడ టు గుంటూరుకు కలిపి మొత్తం 110 కి.మీ హైవే ఉందని తెలిపారు.