హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాలను పురసరించుకొని నేడు నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రన్‌ను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రన్‌తోపాటు మహిళా దినోత్సవం, వైద్యారోగ్య దినోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో ఆదివారం సాయంత్రం సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగా రన్ నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని అంబేదర్ విగ్రహం పకనున్న మైదానం నుంచి ఉదయం 6 గంటలకు రన్ ప్రారంభమవుతుందని, ఐదువేల మంది పాల్గొంటారని తెలిపారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆకస్మిక మృతితో ములుగు జిల్లాలో తెలంగాణ రన్‌ను వాయిదా వేయాలని ములుగు కలెక్టర్‌ను శాంతికుమారి ఆదేశించారు.