హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ)/తిరుమలాయపాలెం : తెలంగాణ విప్లవకారుడు, అరుణోదయ నాగన్న కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజా రాం గ్రామానికి చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ‘అన్న అమరుడురా మన రామనరసయ్య’ పాటతో పరకాల నాగన్న సుపరిచితులయ్యా రు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నాగన్న మృతి తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు అని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. శుక్రవారం ఖమ్మంలో నాగన్న భౌతికకాయానికి జూలూరు గౌరీ శంకర్, సాహిత్య అకాడమీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ప్రసేన్, ప్రముఖ సాహిత్య విమర్శకుడు కవి సీతారాం, సామాజిక కార్యకర్త కాకి భాసర్, బీసీ రచయితల సమైక్య జిల్లా కన్వీనర్ ములా సురేశ్ నివాళులర్పించారు.