ముథోల్, ఆగస్టు 8: బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన తెలంగాణ వాసి అరిగోస పడుతున్నాడు. ఇంట్లో పని ఉందని ఇక్కడికి తీసుకొచ్చి ఎడారిలో ఒంటెల కాపరిగా నియమించారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. త నను తెలంగాణకు రప్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ను వేడుకుంటున్నాడు. ఈ మేరకు కువైట్‌లో తాను పడుతున్న బాధలపై ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్.. కుటుంబాన్ని పో షించుకోవడానికి, ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు 10 నెలల క్రితం ఓ ఏజెంటు ద్వారా కువైట్‌కు వెళ్లా డు. ఇంట్లో పని అని చెప్పి ఏజెం టు త నను ఇక్కడికి పం పించాడని, తీరా ఇక్కడికొచ్చాక ఇం ట్లో పని కా కుం డా ఎడారిలో ఒంటెలను మేపడానికి పెట్టారని వాపోయాడు. నెలల తరబడి పట్టణాలకు దూరంగా ఉంటూ ఎండను తట్టుకోలేక పలుమార్లు అనారోగ్యానికి గురయ్యానని ఆవేదన వ్యక్తంచేశాడు.
యజమాని వేధిస్తున్నాడని మనస్తాపం చెందాడు. ప్రథమ చికిత్స కూడా చేయించడం లేదని కన్నీటి పర్యంతమయ్యా డు. తనను సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ముథో ల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదుకుని తెలంగాణకు రప్పించాలని వేడుకుంటున్నా డు. మరోవైపు.. కుటుంబ పెద్ద లేని లోటు తమను మానసికంగా వేధిస్తున్నదని, ప్రజాప్రతినిధులు స్పందించి తన భర్తను సురక్షితంగా రప్పించేందుకు సాయం చేయాలని రాథోడ్ భార్య, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.