విద్యుత్తు డిమాండ్ 14,361 మెగావాట్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత విద్యుత్తు రంగంలో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఓవరాల్ గరిష్ఠ డిమాండ్ 15,497 మెగావాట్లు (30.3.2023) నమోదు కాగా, శుక్రవారం ఉదయం మరో రికార్డు నెలకొంది. సొంత రాష్ట్రం ఏర్పడ్డ తరువాత వానకాలం (ఖరీఫ్) సీజన్లో ఎన్నడూ రానంతగా శుక్రవారం ఉదయం 11.21 గంటలకు 14,361 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది.
- స్వరాష్ట్రంలో వానకాలంలో శుక్రవారం అత్యధిక డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత విద్యుత్తు రంగంలో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఓవరాల్ గరిష్ఠ డిమాండ్ 15,497 మెగావాట్లు (30.3.2023) నమోదు కాగా, శుక్రవారం ఉదయం మరో రికార్డు నెలకొంది. సొంత రాష్ట్రం ఏర్పడ్డ తరువాత వానకాలం (ఖరీఫ్) సీజన్లో ఎన్నడూ రానంతగా శుక్రవారం ఉదయం 11.21 గంటలకు 14,361 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది.
గత తొమ్మిదేండ్లలో ఏ వానకాలం సీజన్లోనూ ఇంతగా డిమాండ్ రాలేదు. వర్షాలు కాస్త నెమ్మదించడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటల సాగుకు విద్యుత్తు అవసరాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే గరిష్ఠ డిమాండ్ ఏర్పడిందని విద్యుత్తు శాఖ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం నమోదైన గరిష్ఠ డిమాండ్లో సింహభాగం దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థదే ఉన్నది. 14,361 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్లో ఎస్పీడీసీఎల్ది 9,577 మెగావాట్లు ఉండగా, ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)ది 4,430 మెగావాట్లు మాత్రమే. గత వానకాలం సీజన్లో గరిష్ఠ డిమాండ్ 12,251 మెగావాట్లుగా నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

