హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో 276 పోస్టుల భర్తీకి అంతా సిద్ధమైంది. రెండు శాఖల్లో 276 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) బుధవారం వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇంటర్ విద్యాశాఖలో 91, సాంకేతిక విద్యాశాఖలో 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, వ్యవసాయశాఖలో మరో 148 వ్యవసాయాధికారి (అగ్రికల్చర్ ఆఫీసర్) పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 1-7-2022 నాటికి 18-44 ఏండ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తులను 2023 జనవరి 6 నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఇక అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఆన్లైన్లో 2023 జనవరి 10 నుంచి 30 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.tspsc. gov.in వెబ్సైట్ను చూడాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ సూచించారు.
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
ఫిజికల్ డైరెక్టర్ : సంఖ్య
సాంకేతిక విద్యలో ఫిజికల్ డైరెక్టర్ : 37
ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ : 91
మొత్తం : 128
అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు మల్టీజోన్ -1 : 100
మల్టీజోన్ -2 : 48
మొత్తం : 148